చిత్రం: మౌన గీతం (1980)
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
పరువమా చిలిపి పరుగు తీయకు.. పరువమా చిలిపి పరుగు తీయకు.. పరుగులో పంతాలు పోవకు.. పరుగులో పంతాలు పోవకు.. పరువమా చిలిపి పరుగు తీయకు.. ఏ ప్రేమ కోసమో చూసే చూపులు.. ఏ కౌగిలింతకో చాచే చేతులు.. తీగలై హొ చిరు పూవులై పూయ.. గాలిలో హొ రాగాలుగా మ్రోగ.. నీ గుండె వేగాలు తాళం వేయ.. పరువమా చిలిపి పరుగు తీయకు.. ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో.. ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో.. వెతికితే హొ నీ మనసులో లేదా.. దొరికితే హ జత కలుపుకోరాదా.. అందాక అందాన్ని ఆపేదెవరు.. పరువమా చిలిపి పరుగు తీయకు.. పరుగులో పంతాలు పోవకు.. పరుగులో పంతాలు పోవకు.. పరువమా చిలిపి పరుగు తీయకు..