చిత్రం: మౌనమేలనోయి(2002)
సంగీతం:రమణగోగుల
సాహిత్యం:
గానం: రమణగోగుల
ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా నీ నయనాల ఆ గగనాల సితారకలా మల్లె మాలికలే రచించే మౌన గీతికలా సన్న జాజులలో సుమించే సందె కోరికలా ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా.. ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా నీ నయనాల ఆ గగనాల సితారకలా నీ పెదవి దాటే పూల ఋతువేదో మీటింది నాలో సుఖ వీణలే నీ కనుల దాటే తీపి కల ఏదో రాసింది నాకే శుభలేఖలే ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా నా కథలు రాసే నీ కవితలెన్నో కరిగించే నాలో కనుపాపలే నీ నడుము దాచే ఊయలలు ఎన్నో పలికించే నాలో ప్రియ జోలలే ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడా నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా పిల్ల గాలులతో ధ్వనించే వేణు గీతికలా ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా నీ నయనాల ఆ గగనాల సితారకలా