Murali Krishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Murali Krishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

Murali Krishna : Yekkadaunna Yemainaa Song Lyrics (ఎక్కడ ఉన్నా ఏమైనా)

చిత్రం: మురళీ కృష్ణ (1964)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: మాస్టర్ వేణు 

గానం: ఘంటసాల 



ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదనీ ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా పసిపాపవలె ఒడి చేర్చినాను కనుపాపవలె కాపాడినాను గుండెను గుడిగా చేశానూ గుండెను గుడిగా చేశానూ నువ్వుండ లేననీ వెళ్ళావు నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ కలలే కమ్మగ పండనీ నా తలపే నీలో వాడనీ కలకాలం చల్లగ ఉండాలనీ దీవిస్తున్నా నా దేవిని దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నేను కోరుతున్నా