Naidu Gaari Kutumbham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Naidu Gaari Kutumbham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జూన్ 2021, శుక్రవారం

Naidugari kutumbam : Taluku Thaluku Chinnadi song Lyrics (తళుకు తళుకు చిన్నది తాజాసోకులున్నది)

చిత్రం : నాయుడు గారి కుటుంబం (1996)

గానం : బాలు, చిత్ర

సంగీతం : కోటి


తళుకు తళుకు చిన్నది తాజాసోకులున్నది

చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు 

కోలకళ్ళల్లో కోరికున్నాది పూలపక్కల్లో వాలమన్నాది 

సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల

మై మరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల

తక్ ధిమితోం తక్ ధిమితోం  తక్ ధిమితోం 

ధితుం ధితుం 

తళుకు తళుకు చిన్నది తాజాసోకులున్నది

చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు 


వలవేసీ వయ్యారాలేపట్టాల నిలదీసి నిగ్గుల్లోనే నెగ్గాల

చలివేసి సంధిట్లోనే చెరాల కలబోసి కావాలని తీరాల

ఒకటై ఎదఎద ముడివేసా కలిసి పదేపదేపెనవేసా

బిడియం హఠాత్తుగ వదిలేసా ఒడిలో భలేసుఖం చవిచూసా

ఓహో అప్సరస లిప్స్ రసాలందుకొనె వేళా 


తళుకు చిన్నది తాజాసోకులున్నది

చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు 


సరదాలే సాయంకోరె వేళల్లో సరసాలే తీరందాటే వేళల్లో

పెరగాలే వాడి వేడి తాకిట్లో పరగాలే సిగ్గువెన్న కౌగిట్లో

చిటికేవేసిందిలే  చిరు ఆశ ఇటుగ రారమ్మని పిలిచేసా

చిటుకుచూపుల్లోనే గురిచూసా కిటుకులాగిలాగి అదిమేసా

ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని పాయే  


తళుకు చిన్నది తాజాసోకులున్నది

చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు 

కోలకళ్ళల్లో కోరికున్నాది పూలపక్కల్లో వాలమన్నాది 

సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల

మై మరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల

తక్ ధిమితోం తక్ ధిమితోం  తక్ ధిమితోం 

ధితుం ధితుం