Nalugu Stambhalata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nalugu Stambhalata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2021, శనివారం

Nalugu Stambalata : Chinukula Raali Song Lyrics (చినుకులా రాలి)

చిత్రం: నాలుగు స్తంభాలాట(1985)

సంగీతం : రాజన్-నాగేంద్ర

సాహిత్యం : వేటూరి 

గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల



పల్లవి: చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరచి పోబోకుమా మమత నీవే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ చరణం:1 ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే ఆ చల్లనే చాలులే హిమములా రాలి సుమములై పూసి ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిథిలమైనా విడిచి పోబోకుమా విరహమై పోకుమా చరణం:2 తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ హాహాహా.....హాహాహా..... హాహాహా.....హాహాహా.....