Nannaku Prematho లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nannaku Prematho లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జూన్ 2021, శనివారం

Nannaku Prematho : Nannaku Prematho Song Lyrics (నాన్నకు ప్రేమతో)

చిత్రం : నాన్నకు ప్రేమతో (2016)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

గానం: సాగర్, దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్



ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో..