Narasimhudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Narasimhudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఏప్రిల్ 2022, శనివారం

Narasimhudu : Yeluko Nayaka Song Lyrics (ఏలుకో నాయకా)

చిత్రం: నరసింహుడు (2005)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మల్లికార్జున్, గంగ

సంగీతం: మణి శర్మ


ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక ధన్యోస్మి అంటాచిలకా అందుకున్నాక అందాల నీ కానుకా... ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా అర్ధం చేసుకో మగరాయా అంతా చెప్పుకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా వివరించే వీలు ఉందా వేధించే వయసులో తన ప్రవహించే వీలు కోరిందా కసిరే కైపు కామన నోప్పంటు భయపడతాన తీపిగాయాలు చేస్తున్నా నిప్పంటినా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదాన కొంపే మునిగిపోగా నిదానించమంటున్నాన కదిలిరావేం మన్మధ సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా సఖి భారం పంచుకోరాదా చెయ్ రా చెలియ సంపద వద్దోద్దు అంటానంటే నిదురిస్తుంటే నీ జంటా సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవేకదా ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక ధన్యోస్మి అంటాచిలకా అందుకున్నాక అందాల నీ కానుకా..