చిత్రం: నేరం నాది కాదు ఆకలిది (1996)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: సత్యం
మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి కత్తితో చేదించనిదీ కరుణతో చేదించాలి కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి తెలిసీతెలియక కాలు జారితే తెలిసీతెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి మనలో కాలు జారనివారు ఎవరో చెప్పండి లోపాలులేని వారు ఎవరో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి గుడులలో లింగాలని మింగే భడా భక్తులు కొందరు ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు ఆకలి తీరక నేరం చేసే ఆకలి తీరక నేరం చేసే అభాగ్యజీవులు కొందరు మనలో నేరం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి మరపురాని గుణపాఠం పది మందిలో నేర్పించాలి హుహ అయితే ఎన్నడు పాపం చేయనివాడు ఎన్నడు పాపం చేయనివాడు ముందుగ రాయి విసరాలి మీలో పాపం చేయని వారే ఆ రాయి విసరాలి యే లోపం లేని వాడె ఆ శిక్ష విధించాలి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి