చిత్రం: నిను చూడక నేను ఉండలేను (2002)
రచన:
గానం:
సంగీతం: ఇళయ రాజా
పల్లవి :
జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లహిరి లో జాజి మల్లీ తోటలోనా జాజి మల్లీతోటలోనా ఊసులాడే గోరు మైనా జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లహిరి లో జాజి మల్లీ తోటలోనా
చరణం 1 :
రోజు చూస్తువున్నా స్నేహంగానే ఉన్న చెప్పలేనే ఎందుకో మరి నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా అందుకోడే ఇంత ప్రేమని ఏ నీలి మేఘానితో రాయాలి నా ప్రేమని ఏ పూల రాగాలతో పంపాలి ఆ లేఖని మనసేమో క్షణమైన ఒక చోట ఉండదే జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా జాజి మల్లి తోటలోనా
చరణం 2:
అమ్మా బాబు అన్నా నువ్వే దారి అన్నా చిన్న మాట గొంతు దాటదే మాటే రాదంటున్నా దారే లేదంటున్నా గుండె చాటు ప్రేమ ఆగదే ఏ ఊహల్లుయ్యాలలో నా ఆశ తీరేదెలా ఈ గాలి కౌగిల్లలొ నా మాట చేరేదెలా ఎవరైనా తెలపాలి మదిలోన బాధని జాజి మల్లీతోటలోనా ఊసులాడే గోరు మైనా జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లహిరి లో జాజి మల్లీ తోటలోనా