చిత్రం: నిర్దోషి (1967)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల
సంగీతం: ఘంటసాల
మల్లియలారా..మాలికలారా.. మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా !! మల్లియలారా..మాలికలారా.. మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా !! జాబిలి లోనే జ్వాలలు రేగే వెన్నెల లోనే చీకటి మూగే జాబిలి లోనే జ్వాలలు రేగే వెన్నెల లోనే చీకటి మూగే పలుకగలేక పదములు రాక పలుకగా లేక పదములే రాక బ్రతుకే తానే బరువై సాగే !! మల్లియలారా..మాలికలారా.. మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా !! మల్లియలారా..మాలికలారా.. చెదరిన వీణ..రవళించేనా జీవనరాగం..చిగురించేనా చెదరిన వీణ..రవళించేనా జీవనరాగం..చిగురించేనా కలతలు పోయి..వలపులు పొంగి కలతలే పోయి..వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లియలారా..మాలికలారా.. మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా !! మల్లియలారా..మాలికలారా.. మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా !!