చిత్రం: నువ్వు వస్తావని(2000)
సంగీతం: S.A.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: చిత్ర
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గుటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి