చిత్రం: పండగ (1998)
రచన: చంద్రబోస్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
F : కొండమీద వెండి వెన్నెల కురిసి కురిసి
తడిసేనమ్మా కోనసీమ కొబ్బరాకు
M : కన్నెపిల్ల మేని ఛాయలా తడిసి తడిసి
మెరిసేనమ్మ ఎర్రబడ్డ గోరింటాకు
F : ఆగని కొంగు ఆశల పొంగు కనబడలేదా
M : రమ్మని నన్ను లాగితే నేను నిలువను కాదా
F : అనువైన ఏకాంతం లేదా
M : ఓఓఓఓఓఓఓ
కొండమీద వెండి వెన్నెల కురిసి కురిసి
తడిసేనమ్మా కోనసీమ కొబ్బరాకు
F : కన్నెపిల్ల మేని ఛాయలా తడిసి తడిసి
మెరిసేనమ్మ ఎర్రబడ్డ గోరింటాకు
M : ఆగని కొంగు ఆశల పొంగు కనబడలేదా
F : రమ్మని నన్ను లాగితే నేను నిలవను కాదా
M : అనువైన ఏకాంతం లేదా
చరణం -1
M : చెంపకెంపులు కోరే చిదిమిన గోరేనా
చంద్రవంకగ మారి మిలమిలలాడేనా
F : వేడిఒంటిని చేరి వెతికిన వేలేనా
హాయి పంటగ మారి పులకలు పూసేనా
M : పిలిచింది నన్ను స్వయంవరం
పలికింది నాలో నరం నరం
F : వయసే వరమాల నీకు
M : వెయ్యాలి సోకే మారాకు
F : ఓఓఓఓఓఓఓ
కొండమీద వెండి వెన్నెల కురిసి కురిసి
తడిసేనమ్మా కోనసీమ కొబ్బరాకు
M : కన్నెపిల్ల మేని ఛాయలా తడిసి తడిసి
మెరిసేనమ్మ ఎర్రబడ్డ గోరింటాకు
చరణం -2
M : పూలపల్లకి తేనా వలచిన చినదానా
తీగమల్లికి నేనే పందిరి కాలేనా
F : పాలవెల్లినికానా పరవశమై పోనా
తేనెవెల్లువ నేనై అల్లుకుపోలేనా
M : నిను నమ్ముకున్న సరాసరి
సుఖమందుకోనా మరీ మరీ
F : సొగసే పొంగేటి వేళ
M : నయగారం అంతా నవ్వేలా
F : ఓఓఓఓఓఓఓ
కొండమీద వెండి వెన్నెల కురిసి కురిసి
తడిసేనమ్మా కోనసీమ కొబ్బరాకు
M : కన్నెపిల్ల మేని ఛాయలా తడిసి తడిసి
మెరిసేనమ్మ ఎర్రబడ్డ గోరింటాకు