చిత్రం: పరుగో పరుగు(1994)
సంగీతం:రాజ్-కోటి
సాహిత్యం: జొన్న విత్తుల
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం నీలికొండల్లో నీరెండై సోకింది కన్నెప్రేమ రాగవీథుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ కల్యాణి అందం కాశ్మీరగంధం కోరింది నేడే కల్యాణబంధం
ఎన్నో జన్మాల బంధాలే ఎదలో సన్నాయి పాడే సంధ్యారాగాల వర్ణాలే చెలితో దోబూచులాడే కన్నుల్లో వెన్నెల్లు కున్న వేళల్లో గుండెల్లో గుమ్మెక్కె ఏముందో ఏమో ప్రేమల్లో ఒయ్యారి మాట వలపు మంత్రం చిన్నారి చెంత చిలిపి తంత్రం
మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం
కన్నె పూబంతి ఊహల్లో పెళ్లి మద్దెళ్లు మోగె నిండు నూరేళ్ళ కౌగిళ్ళు శాంతి సౌఖ్యాలు కోరె. సందెల్లో సింగారి సిందూరపూల చెక్కిళ్లు పొద్దంతా ముద్దాడి వర్ధిల్లమంది వెయ్యేళ్లు సయ్యాటలాడే సరసరాగం ఉయ్యాలలూగే ప్రేమహృదయం
మౌనమేల ఈ మధుమాసం వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం నీలికొండల్లో నీరెండై సోకింది కన్నెప్రేమ రాగవీథుల్లో జాబిల్లై నవ్వింది ముద్దుగుమ్మ కల్యాణి అందం కాశ్మీరగంధం కోరింది నేడే కల్యాణబంధం
వేచి ఉన్నా నీ జతకోసం అందుకున్నా నీ దరహాసం ఆలపించా నీ అనురాగం