Pidugu Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pidugu Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2022, శుక్రవారం

Pidugu Ramudu : Rara Kougili Song Lyrics (రా రా రారా కౌగిలి)

చిత్రం: పిడుగు రాముడు (1966)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: టి. వి. రాజు



రా రా రారా కౌగిలి చేర రారా దొరా.. ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా మెరుపులున్న చినవాడా రా రా రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా... రా రా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా... చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే.. చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే.. మనసందుకో నా మరులందుకో.... మనసందుకో నా మరులందుకో.... ఓ మగరాయడా నీకు బిగువెందుకో రా రా కౌగిలి చేర రారా దొరా....ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా... పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి... పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి... మాటాడవా సయ్యాటాడవా.... మాటాడవా సయ్యాటాడవా.... నీ కొస చూపుతో నన్ను వేటాడవా రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా... రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

26, ఫిబ్రవరి 2022, శనివారం

Pidugu Ramudu : Ee Reyi Neevu Nenu Song Lyrics (ఈ రేయి నీవు నేను)

చిత్రం: పిడుగు రాముడు (1966)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: టి. వి. రాజు




ఓహో..హో.. ఓ..ఓ..ఓ..ఓ.. ఓహో..ఓ ఓహో..హో.. ఓ..ఓ..ఓ..ఓ.. ఓహో..హో.. ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. హా..ఓ ఓ..ఓ..ఓ.. ఓహో..హో..ఓ..ఓ.. ఓ..ఓహో..హో..ఓ.ఓ ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి.. నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి.. ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి.. నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి.. ఏ మబ్బు మాటున్నావో.. ఏ పొదల చాటున్నావో ఏ మబ్బు మాటున్నావో.. ఏ పొదల చాటున్నావో ఏ గాలి తరగలపైనా.. ఊగి ఊగి పోతున్నావో ఏ గాలి తరగలపైనా.. ఊగి ఊగి పోతున్నావో కలగా.. నన్నే.. కవ్వించేవో.. ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి.. నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి.. చందమామలో ఉన్నాను.. చల్లగాలిలో ఉన్నానూ..ఊ.. చందమామలో ఉన్నాను.. చల్లగాలిలో ఉన్నాను నీ కంటి పాపలలోనా.. నేనూ దాగి ఉన్నానూ..ఊ.. నీ కంటి పాపలలోనా.. నేనూ దాగి ఉన్నాను నీలో.. నేనై.. నిలిచున్నాను..ఊ .. ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి.. నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి.. ఆనాటి చూపులన్ని.. లోన దాచుకున్నానూ..ఊ ఆనాటి చూపులన్ని.. లోన దాచుకున్నాను నీవు లేని వెన్నెలల్లోన నిలువజాలకున్నానూ..ఊ నీవు లేని వెన్నెలల్లోన నిలువజాలకున్నాను కనవే.. చెలియా.. కనిపించేనూ ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి.. నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి.. ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి.. నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..