చిత్రం: పూజాఫలం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: C. నారాయణ రెడ్డి గాయని: జానకి పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే నింగిలోన చందమామ తొంగిచూచే నీటిలోని కలువభామ పొంగిపూచే ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనెజల్లు కురిసిపోదా? కడలి పిలువ కన్నెవాగు పరుగు తేసే మురళి పాట విన్న నాగు శిరసునూపే ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా? నీలిమబ్బు నీడలేసి నెమలి ఆడే పూలఋతువు సైగ చూసి శిఖము పాడే మనసే వీణగా ఝణఝణ మ్రోయగా బ్రతుకే పున్నమిగా విరిసిపోదా?