చిత్రం: ప్రేమ పల్లకి(1998)
సాహిత్యం:
గానం:
సంగీతం: కృష్ణ-నీరజ్
పల్లవి: నువ్వు వుంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాదా వెన్నెల వాన నువ్వు వుంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాదా వెన్నెల వాన నువ్వు నాలో నిండుకున్న మౌనం నువ్వు నాలో సాగుతున్న గానం నువ్వంటే నాలో వున్న ప్రాణం ప్రాణం... ప్రాణం... ప్రాణం.... నువ్వు వుంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటు రాదా వెన్నెల వాన చరణం:1 తెల్లవారుతుంటే ఎప్పుడెప్పుడంటూ చూసే దాక మనస్సు ఆగదు పొద్దు వాలుతుంటే కళ్ళనిండా నీరై కాంతి కూడా నన్ను చేరదు చీకటింటిలోన చిన్నబోయి నేను నిన్ను చేరే దారి ఏదని చూసేను చేరకున్నా దూరముండి నిన్ను చూస్తే చాలంటాను నువ్వు వుంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాదా వెన్నెల వాన చరణం:2 ప్రేమ ఏమో గానీ పేద గుండెల్లోన ప్రేమ కాంతి నువ్వేనని భాష చెప్పలేని భావకుణ్ణే గానీ బాధ నీరు ఆపలేనని లోకులంతా చేరి పిచ్చివాణ్ణి అననీ మేకులల్లే మారి గాయమైనా గానీ నిన్ను చూస్తే నవ్వుకుంటూ రక్తమైనా ఓడుతాను నువ్వు వుంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాదా వెన్నెల వాన నువ్వు నాలో నిండుకున్న మౌనం నువ్వు నాలో సాగుతున్న గానం నువ్వంటే నాలో వున్న ప్రాణం ప్రాణం... ప్రాణం... ప్రాణం.... నువ్వు వుంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాదా వెన్నెల వాన