చిత్రం: ప్రేమ శిఖరం(1993)
సంగీతం:మనోజ్
నేనే తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్న నీవే ఆకాశం గంగే తలవంచి శివగంగే కోరి వచ్చింది ఈ వేళ మూడే చిగురించి కుసుమించే వలపులో నేనే తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్న నీవే ఆకాశం ఓ ఓ.. ఓ ఓ.. గున్నమామి తోటల్లో కోకిలల్లే వచ్చావు పాడలేని పాటల్లో పల్లవేదో తెచ్చావు వసంతాల వాకిట్లో కొత్త పూలు చల్లావు సుగంధాల ముద్దులతో సంతకాలు చేసి అందాలన్ని ఓఓ..ఓఓ.. ఆహ్వానాలే బంధాలన్ని ఓఓ..ఓఓ.. పేరంటాలే వరుల విరుల తొలి మధుమాసం తరలి వచ్చినది మన కోసం కనులు గీటినది హరిశాపం మనసు దాటినది తొలి తాపం నేనే తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్నా నీవే ఆకాశం ఓ ఓ.. ఓ ఓ.. అమావాస్య ఆకాశం జాబిలమ్మ ఉయ్యాలా చీకటైన నా ప్రాయం వెన్నెలేసుకోవాలా హిమాలయ శిఖరంలో ప్రేమ లేఖ రాయలా మరో సీత నీ కోసం లంక దాటి రా..దా వాక్యాలన్నీ.. కావ్యాలైతే ప్రాణాలన్ని ఓ..ఓ.. గానాలేరా చిలిపి కనుల చెలి అనురాగం పిలుపు తెలిపినది హేమంతం చినుకు తారకల ధరహాసం చిగురు వేసినది ప్రియ మాసం నేనే తారలాగా వచ్చా నీ కోసం నన్నే ఆదుకున్న నీవే ఆకాశం గంగే తలవంచి శివగంగే కోరి వచ్చింది ఈ వేళ మూడే చిగురించి కుసుమించే వలపులో లాలా లాలలాలా లాలా.... ఓఓ ఓఓ....