Premikudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Premikudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మే 2022, శుక్రవారం

Premikudu : O Cheliya Song Lyrics (ఓ చెలియా ..నా ప్రియ సఖియా )

చిత్రం:  ప్రేమికుడు (1994)

సంగీతం:  ఏ. ఆర్ . రెహమాన్

సాహిత్యం:  రాజశ్రీ

గానం: ఉన్నికృష్ణన్



ఓ చెలియా ..నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే.. ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే... నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ.. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే..ఏ.. నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ.. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే... ఈ పూటా చెలి నా మాటా  ఇక కరువై పోయెనులే అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే... వీక్షణలో నిరీక్షణలో అర క్షణ మొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే ఈ జీవికీ జీవనమరణమూ నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ... ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే..ఏ.. వెన్నెలమ్మా నీకు జోల పాడి కాలి మెటికలు విరిచేనే..ఏ.. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ.. నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగులా చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే... నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ.. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే..ఏ.. నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ.. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే...

5, నవంబర్ 2021, శుక్రవారం

Premikudu : Mukkala Mukabula Song Lyrics (ముక్కాలా ముక్కాబులా లైలా)

చిత్రం:  ప్రేమికుడు (1994)

సంగీతం:  ఏ. ఆర్ . రెహమాన్

సాహిత్యం:  రాజశ్రీ

గానం: మనో



అ: ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా ఆ: లవ్వుకి కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వులా మత్తుజల్లే మమ్చువెన్నెలా ఓలేలో

అ: ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

ఆ: జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను అ: పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను ఆ:కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది అ: పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను  స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను ఆ: మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా                

అ: ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా


ఆ: తుపాకి లోడు చేసి గురిపెట్టికాల్చిన హృఅదయాలు గాయపడునా అ: తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా ఆ: భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా అ:రావే నా రాజహంస రతనాల మణిపూస  జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి ఆ: సంతోష మెన్నడూ సాగరమై సాగదు          


అ: ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

Premikudu : Andamaina Premarani Song Lyrics (అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..)

చిత్రం:  ప్రేమికుడు (1994)

సంగీతం:  ఏ. ఆర్ . రెహమాన్

సాహిత్యం:  రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఉదిత్ నారాయణ్, ఎస్. పి.బి. పల్లవి


అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే బోండుమల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం... ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..