Preyasi Raave లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Preyasi Raave లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2021, శనివారం

Preyasi Raave : Tenchukunte Tegipotunda Song Lyrics (తెంచుకుంటె తెగిపోతుందా)

చిత్రం : ప్రేయసి రావే (1999)

సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ

సాహిత్యం: భువనచంద్ర

గానం: బాలసుబ్రహ్మణ్యం


తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం ఏడు అడుగులు నడిచిన వాడే… ఏడు జన్మలు తోడుంటాడు భర్తగా నిను భరించు వాడే… బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాతి చరామి…! అగ్ని హోత్రమె అందుకు హామి… ||2|| తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం… శ్రీవారిని పూజించాలి… చిరునవ్వుల హారతితో దాంపత్యం వికసించాలి… తరగని మురిపాలతో దాసి నీవై ప్రేయసి నీవై… నీవే తన ప్రాణమై… నిండు ప్రేమను తనకందించు… నూరేళ్లూ నడిపించు… పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై… ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా… మగని హృదయం మమతల నిలయం… మగువకే దేవాలయం ||2|| తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం… తెగువతో తన పతి ప్రాణాలే… తిరిగి తెచ్చును ఇల్లాలే అడవిపాలై వెడలిన పతిని… అనుసరించును ఇల్లాలే చెదిరిపోని నుదుటి రాతకు… శ్రీకారం దంపతులే గాయం ఏ ఒక్కరిదైనా… కన్నీళ్లూ ఇద్దరివే… పగలు రేయిగా… బ్రతుకే హాయిగా… కలకాలమూ నిలవాలి మీరు… పసుపు కుంకుమలుగా… ఆలుమగలే సృష్టికి మూలం… వారికే తల వంచును కాలం ||2||

17, జూన్ 2021, గురువారం

Preyasi Raave : Neekosam Neekosam Song Lyrics (నీ కోసం నీ కోసం)

 

చిత్రం : ప్రేయసి రావే

సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ

సాహిత్యం: భువనచంద్ర

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



నీ కోసం నీ కోసం… జీవించా చిలకా… నా ప్రాణం నీ వేనే మణితునకా… నా కోసం నా కోసం… నిన్నే నా జతగా… ఏ దైవం పంపేనో బహుమతిగా… నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా… కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా… మిన్నూ మన్నూ… ఏకం చేద్దాం హరివిల్లుగా… నా కోసం నా కోసం… నిన్నే నా జతగా ఏ దైవం పంపేనో బహుమతిగా… నా ఊపిరిలో ఉయ్యలేసి… నూరేళ్ళ కాలం… నిను లాలించాలి… వెచ్చని కలల్ని పంచాలి… నీ స్నేహంలో స్నానం చేసి… నా కన్నే దేహం తరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి… పరులకు ఎన్నడు తెలియని… చల్లని చెలిమితో ఈ నా అనురాగం… నీ గుండెనే మీటనీ… విరహపు వేడికి కనబడక… విడవని జోడుగ ముడిపడగా అల్లే ఈ బంధం… కలకాలముండి పోనీ… నీ కోసం నీ కోసం… జీవించా చిలకా… నా ప్రాణం నీ వేనే మణితునకా… కాసేపైన కల్లోనైనా… నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా ఒంటరి తనాలు ఉన్నాయా… ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా… నీ రూపు లోనే ప్రతీది చూస్తున్నా… నిన్నే ప్రపంచమంటున్నా… మమతలు చిందిన… మధువులు విందుకు అతిధులుగా ఆహ్వానిద్దాం… ఆరారు కాలాలనీ… అలలకు అందని జాబిలిని… వెన్నెల వానగ దించుకొని… గెలిచే సంద్రంలా… సంతోషం పొంగిపోనీ… నా కోసం నా కోసం… నిన్నే నా జతగా… ఏ దైవం పంపేనో బహుమతిగా… నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా… కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా… మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా… ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ…