Puli Bidda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Puli Bidda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఆగస్టు 2021, సోమవారం

Puli Bidda : Kaasi Viswanatha Song Lyrics (కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ)

చిత్రం : పులిబిడ్డ  (1981)

సంగీతం: చక్రవర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 



కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది కాళ్ళమీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది కాళ్ళమీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా అది అంతరాత్మనే నులిమేసిందా ఇక సత్యమన్నదే కరువవుతుందా ఇక సత్యమన్నదే కరువవుతుందా కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ శంభో మహదేవ హరహర శంభో మహదేవ శంభో మహదేవ హరహర శంభో మహదేవ దేహం,రూపం,ప్రాణం సర్వం విశాలక్షి భిక్ష అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష దేహం,రూపం,ప్రాణం సర్వం విశాలక్షి భిక్ష అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష ఇద్దరుతల్లుల ముద్దులబిడ్డకు ఇది అగ్నిపరీక్ష ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను గుడిలోని తండ్రే మనకు తీర్పు గుడిలోని తండ్రే మనకు తీర్పు కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ శంభో మహదేవ హరహర శంభో మహదేవ