చిత్రం: పులి బొబ్బిలి (1983)
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల
సంగీతం: రాజన్-నాగేంద్ర
పల్లవి: అ : పరిమళించు పున్నమిలో...... ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసవేళలో ఆ : ఆ..... ఆ.... ఆ.... పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసవేళలో అ : ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది చరణం: 1 ఆ : యవ్వనమే నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే అ : తానె విరితేనై తానాలు ఆడిందిలే ఆ : నిన్నుగని ఎదకోయిలగ రాగాలు తీసిందిలే అ : నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే ఆ : చెలిమికిదే చైత్రమనీ నా ఆశ పూసింది అందాల బృందావిహారాలలో అ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది ఆ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది చరణం: 2 అ : అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే ఆ : నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే అ : బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో ... ఆ : నాలో విరితావి వెదజల్లిపోయిందిలే అ : జాబిలిగా.. వెన్నెలగా.. ఈ జంట కలిసింది కార్తిక పూర్ణిండు మాసాలలో ఆఆఆ ఆ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది అ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది ఇద్దరు : మౌనమే.. గానమై.. మధుమాసవేళలో మౌనమే.. గానమై.. మధుమాసవేళలో లలలాలల లలలాలల