చిత్రం: రాధా కల్యాణం (1981)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
సంగీతం: కె.వి.మహదేవన్
కలనైనా.. క్షణమైనా.. మాయనిదే మన ప్రేమా.. మన ప్రేమా కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా.. మన ప్రేమా కలనైనా.. క్షణమైనా నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా కలనైనా... క్షణమైనా నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని కౌగిలిలో.. కౌగిలిలా.. కరిగేదే.. మన ప్రేమా కలనైనా క్షణమైనా మాయనిదే.. మన ప్రేమా మన ప్రేమా కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా మన ప్రేమా కలనైనా క్షణమైనా ....