Rajaputra Rahasyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rajaputra Rahasyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జనవరి 2025, బుధవారం

Rajaputra Rahasyam : Dikkulenni Dhaataado Song Lyrics (దిక్కులెన్ని దాటాడో...)

చిత్రం: రాజపుత్ర రహస్యం (1978)

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: ఎస్.జానకి, పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

దిక్కులెన్ని దాటాడో...  సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో... గ్రంధసాంగుడు
దిక్కులెన్ని దాటాడో...  సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో... గ్రంధసాంగుడు
సరస మధుర శృంగార నాయకుడు నావాడే
అప్సరసల తనులతా వైణికుడు నావాడే
నవ మదనుడు రసపురుషుడు.. ఈ మానవుడు మనవాడే
దిక్కులెన్ని దాటాడో సుందరాంగుడు

చరణం 1 :

నరుడైన సురుడల్లే తోచినాడే... పెదవుల్లో సుధలెన్నో దాచినాడే
భువి నుంచి దివి దాకా వచ్చినాడే... ఎదిగెదిగి ఎద దాటి పోయినాడే
క్షణమైన చాలే ఆ కౌగిలి... అమృతాధరుడైన అతనెంగిలి
క్షణమైన చాలే ఆ కౌగిలి... అమృతాధరుడైన అతనెంగిలి
కృతి లేని బ్రతుకే శృతిలేని వీణ
మనసున్న మనిషే మనకన్న మిన్న
దిక్కులెన్ని దాటాడో...  సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో... గ్రంధసాంగుడు
దిక్కులెన్ని దాటాడో...  సుందరాంగుడు

చరణం 2 :

విరహంలో మోహాలే తెచ్చినాడే... విరిశయ్య దాహాలే పెంచినాడే
మన్మధుడే మానవుడై పుట్టినాడే... స్వర్గంలో దేవతగా మెట్టినాడే
ఏమివ్వగలదాన నీ నరునికి... ఏమివ్వగల నీ మనోహరునికి
ఏమివ్వగలదాన నీ నరునికి... ఏమివ్వగల నీ మనోహరునికి
కృతి లేని బ్రతుకే శృతిలేని వీణ
మనసున్న మనిషే మనకన్న మిన్న
దిక్కులెన్ని దాటాడో...  సుందరాంగుడు
చుక్కలెన్ని మీటాడో...గ్రంధసాంగుడు
దిక్కులెన్ని దాటాడో...  సుందరాంగుడు
సుందరాంగుడు... గ్రంధసాంగుడు
సుందరాంగుడు... గ్రంధసాంగుడు

Rajaputra Rahasyam : Siri Malle Puvvu Meedha Song Lyrics (సిరిమల్లె పువ్వు మీద)

చిత్రం: రాజపుత్ర రహస్యం (1978)

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...
కోరికేదో కోన దాటిపోయిందే... నా కోరికేదో కోనదాటిపోయిందే
గోరింట పొదరింట గోరింకా...
కోరికంతా కోక చుట్టుకుంటాలే... నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే
సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...
కోరికేదో కోన దాటిపోయిందే...

చరణం 1 :

కొండా ఉందీ కోనా ఉందీ... కొండమల్లీ వానా ఉంది
కోరుకున్నా నీ ఒడిలో వలపు నారుమడి నాకుంది
కన్నెవలపు కట్నాలిస్తా... వెన్నమనసు కానుకలిస్తా...
వస్తావా కరిగిస్తావా...
నీ గడసరి అల్లికలిస్తే... నా మగసిరి మల్లికలిస్తా...
వస్తావా కలిసొస్తావా
కౌగిట నన్నే కాచుకో... మీగడలన్నీ దోచుకో..
నన్నే నీతో పంచుకో... నిన్నే నాలో పెంచుకో...
హ... హా.. కౌగిట నన్నే కాచుకో... మీగడలన్నీ దోచుకో..
నన్నే నీతో పంచుకో... నిన్నే నాలో పెంచుకో...

సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...
కోరికేదో కోన దాటిపోయిందే...
గోరింట పొదరింట గోరింకా...
నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే... 

చరణం 2 :

ఆకు ఉందీ పిందె ఉందీ...
రేకు విరిసే సోకూ ఉందిపువ్వూ ఉందీ పూతా ఉందీ...
మల్లెపొదలా మాటు మనకుంది
దుక్కిపదును పంటలు కోస్తా...
మొక్కజొన్న కండెలు ఇస్తావస్తావా... ముద్దిస్తావా.. హహా
బంతిపూలా పక్కలు వేస్తా... 
గున్నమావి జున్నులు పెడతావస్తావా...  మురిపిస్తావా
రెక్కల రెపరెపలెందుకో... చుక్కల విందులు అందుకో
చిక్కని వలపుల పొందులో... తొలి సిగ్గులనే దులిపేసుకో...
హహా...  రెక్కల రెపరెపలెందుకో... చుక్కల విందులు అందుకో
చిక్కని వలపుల పొందులో... తొలి సిగ్గులనే దులిపేసుకో...

సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...
కోరికేదో కోన దాటిపోయిందే...
గోరింట పొదరింట గోరింకా...
నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే
సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా...
కోరికేదో కోన దాటిపోయిందే...

Rajaputra Rahasyam : Entha Sarasudu Song Lyrics (ఎంత సరసుడైనాడమ్మా... )

చిత్రం: రాజపుత్ర రహస్యం (1978)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా
ఏ గాలి తాకిందో ఇంతవాడైనాడమ్మా
ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా

ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా
ఏ గాలి తాకిందో ఇంతవాడైనాడమ్మా
ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా

చరణం 1 :

తాకింది ఒకసారైనా తడి వలపు తొందరలాయే
నాటింది ఒక ముద్దైనా నా వల్ల కాకపోయే
ఇంతలోనే ఇంతలైతే... చినుకులోనే మునకలైతే
ఎలా తట్టుకుంటానో... ఓ..ఓ..ఓ..
ఈ రసికత వెల్లువైతే... ఈ రసికత వెల్లువైతే... 
ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా
ఈ పిల్లగాలి తాకి ఇంతవాడైనాడమ్మా
ఇంకెంతో అవుతాడమ్మా... ఇంకెంతో అవుతాడమ్మా... 

చరణం 2 :

పొద్దు పొడువనివ్వను... ముద్దులాగిపోవునేమో
కౌగిలి విడనీయను.. కాగే చలి ఆగునేమో
పొద్దు పొడువనివ్వను... ముద్దులాగిపోవునేమో
కౌగిలి విడనీయను.. కాగే చలి ఆగునేమో
ఋతువులపై శయనించి.. రుచులన్నీ రంగరించి..
ఋతువులపై శయనించి.. రుచులన్నీ రంగరించి..
రసజగాల తేలింతునే...
రాచవన్నె రామచిలక... రాచవన్నె రామచిలక... 
ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా
ఈ పిల్లగాలి తాకి ఇంతవాడైనాడమ్మా
ఇంకెంతో అవుతాడమ్మా...
ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా

Rajaputra Rahasyam : Opaleni Theepi Song Lyrics (ఓపలేని తీపి ఇది... ఓయమ్మో...)

చిత్రం: రాజపుత్ర రహస్యం (1978)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ...
ఓపలేని తీపి ఇది...  ఓయమ్మో...
మోయలేని హాయి ఇది ఎక్కడిదమ్మో... ఎక్కడిదమ్మో
ఓపలేని తీపి ఇది ఓయమ్మో...
మోయలేని హాయి ఇది ఎక్కడిదమ్మో... ఎక్కడిదమ్మో
కోరికలీరికలెత్తే కొత్త రుచి ఎప్పడిది
కాటుక హద్దులు దాటిన కల కౌగిలి ఎవ్వరిది
ఓపలేని తీపి ఇది...  ఓయమ్మో...

చరణం 1 :

ఝుమ్మని తుమ్మెద రొదపెడితే...  రమ్మని నన్నెవరో పిలిచినట్టు ఉంది
కమ్మని తేనెలు ఇమ్మని అడిగినట్టు ఉంది
ఝుమ్మని తుమ్మెద రొదపెడితే... రమ్మని నన్నెవరో పిలిచినట్టు ఉంది
కమ్మని తేనెలు ఇమ్మని అడిగినట్టు ఉంది 
చందమామ కాటుకే అందని చోటా...
సందెగాలి తాకినా సందడిగా ఉంది... అలజడి రేగింది
చుక్కల చూపుల చక్కలిగింతల ఉక్కిరిబిక్కిరి అవుతుంటే..
హా..హా.. హా..హా

ఓపలేని తీపి ఇది ఓయమ్మో...
మోయలేని హాయి ఇది ఎక్కడిదమ్మో... ఎక్కడిదమ్మో

చరణం 2 :

సిరిమల్లెలు విచ్చినా... కరిమబ్బులు పట్టినా
తొలకరి వలపే నాలో తొందర చేస్తున్నది
సిరిమల్లెలు విచ్చినా... కరిమబ్బులు పట్టినా
తొలకరి వలపే నాలో తొందర చేస్తున్నది
అడవిమల్లె విచ్చినా...  అది సిగలో గుచ్చినా
పోతుతీగ కావాలని జాతర చేస్తున్నది
దోపిడి చూపుల దాగుడుమూతలు అల్లరిఅల్లరి పెడుతుంటే
హ...హ...హా.. ఆ....
ఓపలేని తీపి ఇది ఓయమ్మో...
మోయలేని హాయి ఇది ఎక్కడిదమ్మో... ఎక్కడిదమ్మో
ఓపలేని తీపి ఇది...  ఓయమ్మో...