చిత్రం: రాజుభాయ్ (2007)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరీష్ రాఘవేంద్ర
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు
ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా
నలువైపులా నా ఎదురే ఉందామైనా ఆమైనా
ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే