చిత్రం: రథసారధి
సంగీతం: రాజ్-కోటి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
సాహిత్యం: వేటూరి
నర్మదా నది తీరంలో నవ మన్మధ అనుకుంట
గౌతమి నదీ తీరంలో సుఖవీణలో చలిగంట
కన్నుల గీటుకో గీటుకో గిచ్చుకో
చూపులా చుట్టుకో ఊపులో ..
నర్మదా నది తీరంలో నవ మన్మధ అనుకుంట
గౌతమి నదీ తీరంలో సుఖవీణలో చలిగంట
ఎగుడు దిగుడు యదలోన్నా
మొగలి పొద రగిలెనే
పగిలి మసక పడుతుంటే
పెదవి పెదవి నడిగేనే
కూయకే మల్లెలా మాయలో మత్తులా..
చేయకు చిట్టీల అందని ఎత్తుల..
సోంపుకో సొగసులు చూపి
దింపకె దిగులు సఖి
చెంపకు చేరుకుల ముద్దు పంపరో పనస రుచి
ప్రేమలో ఏదటో.. ఏమిటో..
చిలిపి చిలిపి కల లెన్నో
నెమలి కనులు నెమరు వేసే
వదులు వదులు వలదంటే
చిగురు వలపు ముదరేసే
పాడకే కోకిల తీరులో కోడిలా
ఆడితే షోఖిల.. వేడిలో వెన్నిలా
సందేకో చలి రతి వచ్చి అందేమో వణికేనురో
పొద్దుకే పొడుపులు వచ్చి నిద్దెరే చెరిగేనులే
ప్రేమలో ఏమిటో..ఏదటో.
నర్మదా నది తీరంలో నవ మన్మధ అనుకుంట
గౌతమి నదీ తీరంలో సుఖవీణలో చలిగంట
కన్నుల గీటుకో గీటుకో గిచ్చుకో
చూపులా చుట్టుకో ఊపులో ..