Roja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Roja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

Roja : Chinni Chinni Aasa Song Lyrics (చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ..)

చిత్రం: రోజా (1992)

సాహిత్యం: రాజశ్రీ

గానం: మిమిని

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ... పూవులా నేనే నవ్వుకోవాలి .. గాలినే నేనై సాగిపోవాలి ... చింతలే లేక చిందులెయ్యాలీ.. వేడుకలలోనా తేలిపోవాలీ.. తూరుపూ రేఖా వెలుగుకావాలి .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ... చేనులో నేనే పైరు కావాలి.. కొలనులో నేనే అలను కావాలి.. నింగి హరివిల్లూ వంచిచూడాలీ.. మంచు తెరలోనే నిదురపోవాలీ.. చైత్ర మాసంలో చినుకు కావాలి.. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ .. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ..

29, జూన్ 2021, మంగళవారం

Roja : Na cheli Rojave Song Lyrics (నా చెలి రోజావే ..)

చిత్రం: రోజా (1992)

సాహిత్యం: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , సుజాత

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే... గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం.. గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం.. అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం.. మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం.. మనసు లేకపోతే మనిషి ఎందుకంట.. నీవు లేకపోతే బతుకు దండగంట.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు.. చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో.. మమత దూరమాయెనే చందమామ దాగిపో.. కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో.. తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో.. మనసులోని మాట ఆలకించలేవా.. వీడిపోని నీడై నిన్ను చేరనీవా.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు..

Roja : Paruvam Vanaga Song Lyrics (పరువం వానగా నేడు కురిసేనులే)

చిత్రం: రోజా (1992)

సాహిత్యం: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , సుజాత

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అలనేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ గారాల చూపులే నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివీ నీవైతే అలనేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే