RudraVeena లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
RudraVeena లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఆగస్టు 2021, మంగళవారం

Rudraveena : Tarali Raada Thane Song Lyrics (తరలి రాద తనే వసంతం.)

చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం (2) గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోద తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా ... అడవిని సైతం వెలుగు కదా (2) ఎల్లలు లేని ..చల్లని గాలి అందరి కోసం అందును కాదా .. ప్రతీ మదిని లేపే ప్రభాత రాగం... పదే పదే చూపే ప్రధాన మార్గం ... ఏదీ సొంతం కోసం కాదను సందేశం .. పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం .. ఇది తెలియని మనుగడ కథ... దిశనెరుగని గమనము కదా తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం బ్రతుకున లేని శృతి కలదా యద సడి లోనేే లయ లేదా (2) ఏ కళ కైనా ఏ కలకైనా ... జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృథా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా పారే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా .. తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోద తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం

Rudraveena : Cheppalani Vundi Song Lyrics (చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది)

చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం




వంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనేగద గుండె బలం తెలిసేది దుఃఖానికి తలవంచితె తెలివికింక విలువేది మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది కోకిలల గుంపుల్లో చెడబుట్టిన కాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినానేకాకిని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట బాట మారాలని చెప్పడమే నా నేరం గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం వసంతాల అందం విరబూసే ఆనందం తేటి తేనె పాట పంచెవన్నెల విరి తోట బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ఏటి పొడవునా వసంతమొకటేనా కాలం ఏదీ మరి మిగితా కాలాలకి తాళం నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు కంటినీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదేరాగం అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం అని అడిగిన నా ప్రశ్నకు అలిగినాప్త కోకిల కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగధ్వానం నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం ఎడారి బ్రతుకున నిత్యం ఛస్తూ సాగే బాధల బిడారు దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయాలి జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనె పెద్దనుకుంటూ కలలో జీవించను నేను కలవరింత కోరను నేను నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికశించుదాక పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను నేను సైతం నేను సైతం

Rudraveena : Chuttu Pakkala Choodara Song Lyrics (చుట్టుపక్కల చూడరా చిన్నవాడ)

చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



చుట్టుపక్కల చూడరా చిన్నవాడ! చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ కళ్ళముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానీయకు వ్యర్ధం స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు సాటి మనిషి వేదన చూస్తు జాలిలేని శిలవైనావు కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే

13, జూన్ 2021, ఆదివారం

Rudraveena : Lalitha Priya Kamalam Song Lyrics (లలిత ప్రియ కమలం విరిసినది)

 చిత్రం : రుద్రవీణ

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: జేసుదాస్ , చిత్ర


పల్లవి: లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ.....ఆ..... ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ....ఆ.... ఉదయ రవికిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది చరణం:1 రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం ... కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం... కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం కలల విరుల వనం మన హృదయం.... వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను.... తేటి స్వరముల మధువులు చిలికెను... తీపి పలుకుల చిలకల కిలకిల.... తీగ సొగసులు తొణికిన మిలమిల..... పాడుతున్నది ఎదమురళీ... రాగ ఝరి తరగల మృదురవళి...... తూగుతున్నది మరులవని... లేత విరి కులుకుల నటనగని..... వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను.. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ.....ఆ..... ఉదయ రవికిరణం మెరిసినది చరణం:2 కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం...... తీసే శ్వాసే ధూపం...చూసే చూపే దీపం... కాదా మమకారం నీ పూజ కుసుమం..... మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది........ కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము...... వీణపలికిన జిలిబిలి గమకము.... కాలి మువ్వగా నిలిచెను కాలము..... పూల పవనము వేసెను తాళము..... హేయమైనది తొలి ప్రాయం ..... రాయమని మాయని మధుకావ్యం...... స్వాగతించెను ప్రేమ పదం....... సాగినది ఇరువురి బ్రతుకు రథం... కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి......... ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ....ఆ..... లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ.....ఆ..... లలిత ప్రియ కమలం విరిసినది