Rukmini లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rukmini లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2021, శనివారం

Rukmini : Godari Revulona Song Lyrics (గోదారి రేవులోన)

చిత్రం: రుక్మిణి (2004 )

సంగీతం: విద్యా సాగర్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సుజాత


గోదారి రేవులోన రాదారి నావలోన

నా మాట చెప్పుకుంటు ఉంటారంటా

నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని

నాలాంటి అందగత్తె నేనేనంట

కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ

పున్నాలు పూయునంట కన్నుల్లో

కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి

ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట


గోదారి రేవులోన రాదారి నావలోన

నా మాట చెప్పుకుంటు ఉంటారంటా

నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని

నాలాంటి అందగత్తె నేనేనంట


పాట అంటె నాదెగాని కోయిలమ్మదా ఉట్టి కారుకూతలే..

ఆట అంటె నాదెగాని లేడిపిల్లదా ఉట్టి పిచ్చిగంతులే..

పొలాల వెంట ఛెంగుమంటు సాగుతూ పదాలు పాడితే

జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే

ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి

చంద్రుడే సిగ్గుతో మబ్బు చాటు చేరుకోడా


గోదారి రేవులోన రాదారి నావలోన

నా మాట చెప్పుకుంటు….

నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని

నాలాంటి అందగత్తె….


నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకీ ఎంత చిక్కు తెచ్చెనే

రాకుమారిలాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే

ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ అనాలి అందరూ

అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ

నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు అ మగాడు

ఇక్కడే ఎక్కడో తపస్సు చేస్తు ఉంటాడు


గోదారి రేవులోన రాదారి నావలోన

నా మాట చెప్పుకుంటు ఉంటారంటా

నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని

నాలాంటి అందగత్తె నేనేనంట

కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ

పున్నాలు పూయునంట కన్నుల్లో

కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి

ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట