Santhinivasam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Santhinivasam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జనవరి 2022, శుక్రవారం

Santhinivasam : Kalanaina nee valape Song Lyrics (కలనైనా నీ వలపే)

చిత్రం: శాంతినివాసం (1960)

సాహిత్యం: సముద్రాల

గానం: పి. లీల

సంగీతం: ఘంటసాల



తుషార శీతల సరోవరాన. అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ... నీ కొరకే. రాజా... వెన్నెల రాజా... కలనైనా నీ వలపే. కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే. కలువ మిఠారపు కమ్మని కలలు... కలువ మిఠారపు కమ్మని కలలు... కళలూ కాంతులూ నీ కొరకేలే. కళలూ కాంతులూ నీ కొరకేలే. చెలియారాధన సాధన నీవే. జిలిబిలి రాజా జాలి తలచరా కలనైనా నీ వలపే. కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే. కనుల మనోరధ మాధురి గాంచి... ఆ .ఆ.ఆ... కనుల మనోరధ మాధురి గాంచి... కానుక చేసే వేళకు కాచి. కానుక చేసే వేళకు కాచి... వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలచెరా... కలనైనా నీ వలపే. కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే.