చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980)
రచన: దాసరి నారాయణ రావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి:
పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ బంగారక్కా చూపే శృంగారక్కా ఓ బంగారక్కా చూపే శృంగారక్కా పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా చరణం: 1 ఆరేళ్ళ ముందు చూస్తే చిన్నపిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్రపిల్ల ఆరేళ్ళ ముందు చూస్తే చిన్నపిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్రపిల్ల ఏడు పెరుగుతుంటే ఈడు పెరుగుతుంది ఈడు పెరుగుతుంటే జోడు కుదురుతుంది ప్రేమకు ఈడెందుకూ? పెళ్ళికి ప్రేమెందుకు? ప్రేమకు పెళ్లితోడు ..పెళ్ళికి ప్రేమతోడు అమ్మతోడు అయ్యతోడు నీకు నాకు ఈడుజోడు హోయ్ .. హోయ్.. పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా ఓ బంగారక్కా చూపే శృంగారక్కా చరణం: 2 మొదటిసారి చూచినపుడు అగ్గిరాముడు... మరి మూడేళ్ల ముందుచూస్తే అడవిరాముడు.. మొదటిసారి చూచినపుడు అగ్గిరాముడు మరి మూడేళ్ల ముందుచూస్తే అడవిరాముడు ఏడు పెరుగుతుంటే వయసు తరుగుతుంది వయసు తరుగుతుంటే సోకు పెరుగుతుంది మనసుకు సోకెందుకు ? వయసుకు మనసెందుకు? మనిషికి మనసు అందం మనసుకు ప్రేమబంధం ఈ అందం ఆ బంధం ఇద్దరిది వివాహబంధం హోయ్! పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్టాంటి కుర్రోడు నాకంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా పందొమ్మిదివందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంటబడలేదు పడినా... నే వెంటపడలేదు ఓ బంగారక్కా చూపే శృంగారక్కా ఓ బంగారక్కా చూపే శృంగారక్కా