చిత్రం: సీమ టపాకాయ్ (2011)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చిలకారెక్క గణేష్
గానం :హేమచంద్ర, ఉష, నోయల్
కంది చేను కొచ్చి నావు..,కన్ను నాకు కొట్టినావు
ముందు ముందు కొచ్చి నావు.,ముద్దు పెట్ట చూసి నావు
ఎట్ట ఉంది మామ ఒల్లు నీ
యెట్ట ఉంది మామ ఒల్లు
యెట్ట ఉంది మామ ఒల్లు
హే అందమంత ఆరబోసి గడ్డిమోపు ఎత్తుకొని
గట్టు మీద పొతు ఉంటే వయసు వేడి పుట్టే ఒళ్ళు
ఎట్ట ఉంది పిల్ల ఒళ్ళు నీ ఇట్టా ఉంది పిల్ల ఒళ్ళు
దారి కాచి దొంగ లాగ కాపు కాస్తివి
నంగానాచి పిల్ల తొందరేంది ఆగమంటివి
వంగి వంగి గడ్డివాము చాటు కొస్తివి.,నన్ను గుచ్చి గుచ్చి ముద్దులాట ఆడమంటివి
వెంటా వెంట పడితేమి వేధించి చంపుతుంటేమి(2)
హే భామ నువ్వు అంటే బాలే మోజు అంటినీ
రోజు కొంటె లుక్కులిచ్చి నవ్వు రుబ్బుతుంటివి
నిమ్మ తోట కాడ నన్ను చేరమంటివి.
తీర చేరినాక చెంగుమంటూ తుర్రుమంటివి
నమ్మ నమ్మా నీ మాట అసలు ఇష్టాంగయే ఈ పూట
నమ్మ నమ్మా నీ మాట అసలు ఇష్టాంగయే ఈ పూట
మా చెల్లి సంత కెళ్ళి పూలు తెస్తివి.,కొప్పు లోన గుచ్చమంటే నడుము నొక్కబోతివి..
మంచి కాడ కొంగు బట్టి లాగ బోతివి
నన్ను అటు ఇటు కదలకుండా చెయ్యి పట్టుకుంటివి
పైట లాగుతుంటేమి పరేషాను పెడితేమి..
మా ఊరు లోన పేరు ఉన్న పొరగాడిని., నీ ఒంపు సొంపు చూసి ఆగలేకపోతిని
ఊరగాయ లాంటి నీ ఊపు చూస్థిని అబ్బ నోరు ఊరి ఒక్కసారి ముందుకొస్థిని
పట్టే పిల్ల నా చెయ్యి శివారాత్రెయ్ ఇంక ప్రతి రేయి
పట్టే పిల్ల నా చెయ్యి శివారాత్రెయ్ ఇంక ప్రతి రేయి
కంది చేను కొచ్చి నావు..,కన్ను నాకు కొట్టినావు
ముందు ముందు కొచ్చి నావు.,ముద్దు పెట్ట చూసి నావు
ఎట్ట ఉంది మామ ఒల్లు నీ
యెట్ట ఉంది మామ ఒల్లు
యెట్ట ఉంది మామ ఒల్లు