చిత్రం: సీతారాముల కళ్యాణం (1986)
సంగీతం: K.V.మహదేవన్
గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల
సాహిత్యం: ఆత్రేయ
విడిపోము మనము ..... ఈ ఎడబాటు క్షణము ..... ఆపైన కళ్యాణము కళ్యాణవైభోగమే ..... కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే ..... అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కావాలి మధుమాసము ..... అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కావాలి మధుమాసము మన ప్రేమ తుదిలేని ఆకాశము ..... మన ప్రేమ తుదిలేని ఆకాశము ..... ప్రతిరోజు పూర్ణిమా శ్రావణము కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే ..... మరులెల్ల మరుమల్లె విరిమాలగా ..... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా ..... మరులెల్ల మరుమల్లె విరిమాలగా ..... మురిపాలముత్యాలె తలంబ్రాలుగా హృదయాల నాదాలె వేదాలుగా ..... హృదయాల నాదాలె వేదాలుగా ..... మన అంతరంగాలే వేదికగా కళ్యాణవైభోగమే ..... వలచాము నిలిచాము ఒక దీక్షగా ..... మనసైన మనసొకటే సాక్షిగా ..... వలచాము నిలిచాము ఒక దీక్షగా ..... మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిశాము దివి మెచ్చగా ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ గెలిచాము కలిశాము దివి మెచ్చగా ..... కలకాలముందాము నులివెచ్చగా కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే .....