చిత్రం: శ్యామ్ సింఘ రాయ్ (2021)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి
సంగీతం: మిక్కీ జే మేయర్
ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవీ కురిపించవే కరుణాంబురాశి ధీంతాన ధీం ధీం తాన, జతులతో ప్రాణమే నాట్యం చేసే, గతులతో నామషతమ్ముల నదులతో, ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే, ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలనీ నాలో ఆవేదనే నువ్వాదరించేలా నివేదనవ్వాలనీ దేహమునే కోవెలగా… నిన్ను కొలువుంచా జీవముతో భావముతో… సేవలు చేశా ప్రతి ఋతువు… ప్రతి కృతువు నీవని ఎంచా… శతతము నీ స్మరణే నే ధీంతాన ధీం ధీం తాన, జతులతో ప్రాణమే నాట్యం చేసే, గతులతో నామషతమ్ముల నదులతో, ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే, ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం....