చిత్రం: శివ పుత్రుడు
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వనమాలి
గానం:R.P.పట్నాయక్
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసి పాడెనే కరుకైనా గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయనే, ఊహలు ఊయలూపెనే చినుకు రాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళ మేసి చెలరేగి పోయెనే తుళ్ళుతున్న చిన్ని సెలయేరూ గుండెలోనా పొంగి పొలమారూ అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనదీ లోగిలంతా పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది నీకు తోడు ఎవరంటు లేరు గతములో నేడు చెలిమి చెయ్ జాపే వారే బతుకులో కలిసిన బంధం కరిగిపోదులే మురళి మోవి విరిమి తావి కలిసిన వేళా చిరుగాలి వీచెనే , చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణువూదెలే మేఘం మనసున వింత ఆకాశం, మెరుపులు చిందే మన కోసం తారలకే తళుకు బెళుకా , ప్రతి మలుపు ఎవరికెరుకా విరిసిన ప్రతి పూదోట కోవెల ఒడి చేరేనా రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో ఏవో పదములే పాడే మోహం గుండెలో ఏనాడు తోడు లేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే కరుకైనా గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయనే, ఊహలు ఊయలూపెనే చినుకు రాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళ మేసి చెలరేగి పోయెనే