Sravana Masam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sravana Masam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2024, ఆదివారం

Sravana Masam : Saidula Song Lyrics (సైదులా )

చిత్రం: శ్రావణ మాసం (1996)

రచన: రాజ్ కుమార్

గానం: కౌసల్య

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


సైదులా సైదులా సైదులా నీ కంచెర జుంపాలు చూసి సైదులా కాపోడనుకున్నా సైదులా కాపోడనుకున్నా సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా నీ కంచెర జుంపాలు చూసి సైదులా కాపోడనుకున్నా సైదులా కాపోడనుకున్నా సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా కాపోడనుకున్నా సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా కండ బలముంది గుండె లేకుంది మండే కొలిముంది మంటే రాకుంది మీ బండరాళ్ళ మనసులకు సైదులా ఓ గుండె పగిలి కథ చెబుతా సైదులా నా గుండె మంట కథ చెబుతా సైదులా సైదులా సైదులా సైదులా నీ కంచెర జుంపాలు చూసి సైదులా కాపోడనుకున్నా సైదులా కాపోడనుకున్నా సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా అనగానగణగా ఓ ప్రేమికులున్నారు మా ఇద్దరి కథలాగే ఆ కథలో కూడను మీ పెద్దలుగానే ఆ పెద్దలు కూడానూప్రేమ గీమా నయ్ అంటూ ప్రేమికులను కొట్టిర్రు పొర పోకిరి అంటూ పోరగాన్ని గెంటిర్రు కానీ ఆ పొరగడు పోరి తో చెప్పిండు నీ కోసం జీవిస్తానని నీ కోసమే మళ్ళీ వస్తానని ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ గంటల నెలలా ఎదురు చూసింది తిండి తిప్పలు లేక కుప్ప కూలి పోయింది చేతులు కదిలించే సత్తువే లేకుండే కాళ్లను కదిలించే ఒపీకే ఒడిగింది అయిన ఒక ఆశ అతడే వస్తాడని ఇదిగో వచ్చనానని అంటాడనుకుంటు అంతలోనే వచ్చాయి ఆమె పైన వాలాయి అచ్చం లోకంలో ఉండే కాకులవి కనికరమే లేకుండా. పొడుచుకు తింటున్నాయి ఒళ్ళంతా జల్లెడల పొడిచి మరి తింటున్నాయి నా చేతులు నా కాళ్ళు నా శరీరంలోని అన్ని భాగాలు తినండి కానీ ఒక్కటి మాత్రం ముట్టుకోవద్దని ఆ కాకులను ప్రాధేయ పడింది ఏమని ప్రాధేయ పడిందో తెలుసా కళ్లు మాత్రం వదలండి... కాకమ్మ కళ్లు మాత్రం వదలండి... కాకమ్మ నా ప్రేమికుణ్ణి చూడాలి .కాకమ్మ నా ప్రేమికుణ్ణి చూడాలి .కాకమ్మ ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ ఓయ్ అన్నలు మెకెట్ట తెలియాలి అన్నలు ప్రేమలో ఉన్నతడి అన్నలు లవ్వంటే మీకెపుడు అన్నలు తెలియాలి మీ కొంపల అన్నలు నీ కంచెర జుంపాలు చూసి సైదులా కాపోడనుకున్నా సైదులా కాపోడనుకున్నా సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా కాపోడనుకున్నా సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా

Sravana Masam : Teluguvaari Pelli Song Lyrics (తెలుగు వారి పెళ్లి )

చిత్రం: శ్రావణ మాసం (1996)

రచన: వెంగిల రాంబాబు, వి.శ్రీనివాస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , మాళవిక

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్




తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికీ తలవంచడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటూంది శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి మంగళకరమే బంగారం నిత్యము శక్తిమయం అది మాంగళ్యంగా ముడి పడితే తరించును స్త్రీ హృదయం తాళిబొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులూ.. అవి పుట్టినింటికీ మెట్టెనింటికీ పట్టిన హారతులూ.. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలూ ఆ చంద్రుని ధాన్యం బియ్యమే కదా పెళ్ళి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి మీ అనుభంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి ఆ వేడుకలన్నీ చూడాలందీ శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఒకే కలపతో ఒకే పలకగా పెళ్ళి పీట ఉందీ అదీ ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుందీ చాలీ చాలని ఆ పీటా సన్నగ ఉంటుంది అది సర్దుకు పోయే మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి