చిత్రం: శ్రీ కృష్ణ పాండవీయం (1966)
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: జిక్కి
సంగీతం: టి.వి.రాజు
ఓహోహో ఓహోహో ఛాంగురే ఛాంగు ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలకమీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది ముచ్చటైన మొలకమీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది జిగిబిగి మేనుంది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్లా నీ సాటి ఎవ్వరుండుట కల్లా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా కైపున్న మచ్చెకంటి చూపు అది చూపుకాదు పచ్చల పిడిబాకు కైపున్న మచ్చెకంటి చూపు అది చూపుకాదు పచ్చల పిడిబాకు పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో గుచ్చుకంటె తెలుస్తుందిరా మనసుచ్చుకుంటె తెలుస్తుందిరా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా గుబులుకొనె కోడె వయసు లెస్సా దాని గుబాళింపు ఇంకా హైలెస్సా పడుచుదనపు గిలిగింత గడుసు వయసు పులకింత ఉండనియవేమిసేతురా కైదండ లేక నిలువలేనురా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా