చిత్రం: శ్రీవారి శోభనం (1985)
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమేష్ నాయుడు
గానం: ఎస్.జానకి
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా... బామ్మ: నాకలకేమిటే నీ మొహం ఊరుకో... అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా... శీతాకాలం సాయంకాలం...మ్ మ్... శీతాకాలం సాయంకాలం...మ్ మ్... అటు అలిగిపోయే వేళా చలికొరికి చంపే వేళా... ఆఆ.... బామ్మ: అందుకే లోపలికి పోతానే తల్లి నన్నొదులు.... రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదూ..!! బామ్మ: హూ నువ్విట్టా ఇంతగొంతేసుకుని పాడితే నిద్దరెట్టాపడుతుందే... రాతిరంతా చందమామ నిదరపోనీదు...ఊ..ఊ... కంటి కబురా పంప లేనూ...ఊ... ఇంటి గడపా దాటలేనూ..ఊ.. ఆ దోర నవ్వు దాచకే.. నా నేరమింకా ఎంచకే ఆ దోర నవ్వు దాచకే.. ఈ నవ్వు నవ్వి చంపకే... రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు... రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ... బామ్మ: ఆ రాతే రాసుంటే ఇంట్లో నే వెచ్చగా నిద్రోయేదాన్ని కదా రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు... రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ... నచ్చినా మహరాజు నీవూ...ఊ.. నచ్చితే మహరాణి నేను... ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా... బామ్మ: అలకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా... అల్లరాపమ్మ శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం నను చంపకే తల్లీ జోకొట్టకే