చిత్రం: సుప్రభాతం(1998 )
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
ఓ ప్రియా వసుంధర ప్రియా ప్రియా ప్రేమనే వరించిరా ప్రియా ప్రియా ఓ ప్రియా మనోహర ప్రియా ప్రియా స్వాగతం స్వయంవరా ప్రియా ప్రియా మనిషికన్న ముందర మనసు చేసే తొందర కనుల గడప దాటుతూ స్వప్నమేదుట పడెనురా కళలలోని కలికి తార చిలుకుతోంది కాంతి ధారా ఓ ప్రియా వసుంధర ప్రియా ప్రియా ఓ ప్రియా మనోహర ప్రియా ప్రియా చరణం :1 అర విరిసిన కన్నులే మీటుతున్నవి అర మరికలు వద్దని చాటుతున్నవి తెర మెరుగులు ఇప్పుడే తొలగుతున్నవి మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి నా మినుకు మినుకు ఆశలే నిజమయ్యేలా నీ వెలుగు తగిలి లోకమే మారే నీవెలా నీ చిలిపి కనుల గూటిలో నేనే ఉండేలా నా బ్రతుకు జతగా చేయగా వచ్చా గోపాల కౌగిళ్ళ సంకెళ్లు వేయనా నిన్ను శృంగార ఖైదీగా చేయాలని ఈ శిక్ష చాలంటూ చాటనా ఒప్పుకుంటాను ఈ తీపి దండన అలక తీరి అసలు ధారి తెలిసి నడిచే రాకుమారి ఓ ప్రియా మనోహర ప్రియా ప్రియా ప్రేమనే వరించిరా ప్రియా ప్రియా చరణం :2 రెప రెపమని రెప్పలే విప్పుకున్నవి తపనల ఎద తాళమే తప్పుతున్నదీ ఎపుడెపుడని ఆత్రమే అడుగుతున్నది అపుడిపుడని వాయిదా వేయనన్నది నా దొరకు దొరుతున్నది నాలో సింగారం ఇక తరిగి కరుగుతున్నది ఇన్నాళ్ల దూరం ఈ కలికి కులుకు కదలికే కన్యాకుమారం నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం క్రిష్ణయ్య తీరున్న రాముడే సిగ్గు విల్లెక్కు పెట్టాడు ధీరుడే కాలాలు కనిపెట్టే కామెడి తన కనికట్టు చుపాడే ధీరుడే ముంచుతున్న మంచు కరిగి పొద్దుపొడుపు వెలుగు కాంతి ఓఓఓ ప్రియా వసుంధర ప్రియా ప్రియా ప్రేమనే వరించిరా ప్రియా ప్రియా ఓ ప్రియా మనోహర ప్రియా ప్రియా స్వాగతం స్వయంవరా ప్రియా ప్రియా మనిషికన్న ముందర మనసు చేసే తొందర కనుల గడప దాటుతూ స్వప్నమేదుట పడెనురా కళలలోని కలికి తార చిలుకుతోంది కాంతి ధారా ఓ ప్రియా వసుంధరా ప్రియా ప్రియా స్వాగతం స్వయంవరా ప్రియా ప్రియా