Swathi Kiranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Swathi Kiranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2021, బుధవారం

Swati Kiranam : Pranathi Pranathi Song Lyrics (ప్రణతి ప్రణతి ప్రణతి)

చిత్రం: స్వాతికిరణం(1992)

రచన: సి. నారాయణ రెడ్డి

గానం: వాణి జయరామ్ గారు

సంగీతం: శ్రీ కే.వి .మహాదేవన్ గారు



పల్లవి :

ప్రణతి ప్రణతి ప్రణతి ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి మ మ ప మ మ ప మ ప ని ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికీ ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ

చరణం : 1

పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా గ్రీం కారమా గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా శ్రీం కారమా ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ

చరణం : 2

పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి....ప్రణవనాద జగతికీ