Swayamkrushi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Swayamkrushi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఆగస్టు 2021, బుధవారం

Swayam Krushi : Sinne Sinne Korikaladaga Song Lyrics (సిన్ని సిన్ని కోరికలడగ)

చిత్రం: స్వయంకృషి(1987)

సంగీతం:రమేష్ నాయుడు.

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:  ఎస్.జానకి


సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ ఆ ఆ ఆ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... ఎరిగిన మనసుకు ఎరలేలే.... ఏలిక సెలవిక శరణేలే.... ఎరిగిన మనసుకు ఎరలేలే.... ఏలిక సెలవిక శరణేలే.... ఎవరికి తెలియని కథలివిలే.... ఎవరికి తెలియని కథలివిలే... ఎవరో చెప్పగా ఇక లేలే.... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... నెలత తలపులే నలుగులుగా.... కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ.... నెలత తలపులే నలుగులుగా.... కలికి కనులతో జలకాలు.... సందిటనేసిన చెలువములే.... సందిటనేసిన చెలువములే.... సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ అ.... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... కలల ఒరుపులే కస్తురిగా.... వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ.... వలపు వందనపు తిలకాలు.... అంకము చేరిన పొంకాలే.... అంకము చేరిన పొంకాలే.... శ్రీవేంకటపతికిక వేడుకలు ఉహు ఉహు ఉ.... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ..... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట..... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ..... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట

Swayamkrushi : Siggu Poobanti Song Lyrics (సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి)

చిత్రం: స్వయంకృషి(1987)

సంగీతం:రమేష్ నాయుడు.

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి, ఎస్. పి. శైలజ


సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా విరజాజి పూల బంతి అర చేత మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న

సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

Swayamkrushi : Paaraahushaar Song Lyrics (పారాహుషార్)

చిత్రం: స్వయంకృషి(1987)

సంగీతం:రమేష్ నాయుడు.

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి




హొ అహ లాలలా అ అహాహ ఆ,,, పారాహుషార్... పారాహుషార్... పారాహుషార్... పారాహుషార్... తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ... తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ... పారాహుషార్... పారాహుషార్... అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు... అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు... ఊరేగుతు వచ్చేనమ్మ పారాహుషార్... పారాహుషార్... పారాహుషార్... తుంటరికన్నయ్య వీడు ఆగడాల అల్లరిచూడు.. తూరుపమ్మ పారాహుషార్.. దుందుడుకుదుండగీడు దిక్కుతోచనీడు.. దక్షిణమ్మ పారాహుషార్.. పాలు పెరుగు ఉండనీడు పోకిరిగోపయ్య చూడు.. పడమరమ్మ పారాహుషార్.. జిత్తులెన్నో వేస్తాడమ్మ.. జిత్తులెన్నో వేస్తాడమ్మ దుత్తలు పడదోస్తాడమ్మ.. ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్.. పారాహుషార్... పారాహుషార్... రేయిరంగు లేనివాడు వేయినామాలవాడు.. తూరుపమ్మ పారాహుషార్.. ఏమూలన నక్కినాడో ఆనవాలుచిక్కనీడు.. దక్షిణమ్మ పారాహుషార్.. ఓ ఓ ఓ ఓ ఓ హో హొ.. నోరార రా రా రారా అన్నా మొరాయించుతున్నాడమ్మా ఆ పడమరమ్మ పారాహుషార్.. ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యలి.. ముతీసెయ్యలి.. ఉత్తరమ్మ పారాహుషార్.. పారాహుషార్... పారాహుషార్... నీలాటిరేవుకాడ నీలమేఘశ్యాముడు చూడ.. అమ్మో ఓయమ్మో.. నీలాటిరేవుకాడ నీలమేఘశ్యాముడు చూడ.. సల్లనైన ఏటినీరు సలసలమరిగిందమ్మ.. అమ్మో ఓయమ్మ.. సెట్టుదిగని సిన్నోడమ్మ బెట్టువదలకున్నాడమ్మ.. సెట్టుదిగని సిన్నోడమ్మ బెట్టువదలకున్నాడమ్మ.. అమ్మమో ఓయమ్మ.. జట్టు కట్ట రమ్మంటుంటే పట్టుదొరకక ఉన్నాడమ్మ.. అమ్మో ఓయమ్మ అమ్మమో ఓయమ్మ.. తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ.. తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ.. పారాహుషార్... పారాహుషార్... పారాహుషార్... పారాహుషార్...