చిత్రం : తల్లి కొడుకుల అనుబంధం (1982)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
సంగీతం : సత్యం
పల్లవి :
దాచుకోకు వలపు వాలు కన్నులా
దరహసించు దశమినాటి వెన్నెలా
మాపటింటి జాడలో... మల్లెపూల నీడలో
కరగాలి వన్నెలన్ని వెన్నలా
దోచుకోకు చిలిపి వాడి కన్నులా
పరిమళించు నవమి లేత వన్నెలా
నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో
అడగాలి ముద్దులన్ని నన్నిలా...
దాచుకోకు వలపు వాలు కన్నులా
పరిమళించు నవమి లేత వన్నెలా
చరణం 1 :
పున్నమంటి చిన్నదాని కౌగిట..
పూటకొక్క పులకరింత పుట్టదా
సన్నజాజి వన్నెకాడి సందిట
సందెగాలి సలపరింత పెట్టదా
పొంగుతున్న వయసులు... బెంగపడ్డ మనసులు
పెరగాలి పెళ్ళి ముందు ప్రేమలా
దోచుకోకు చిలిపి వాడి కన్నులాదరహసించు దశమినాటి వెన్నెలా
చరణం 2 :
చినుకులాంటి చిన్నవాడి చూపులే...
వలపు తెలుపు మాట లేని పిలుపులు
మేని వంటి కన్నెపిల్ల మేనిలో...
తొంగి చూసే నింగిలోని మెరుపులు
పడుచు పడ్డ విరుపులు వయసు ఆట విడుపులు
కలవాలి ప్రేమ ఇంక పెళ్ళిగా... ఆ.. ఆ
దాచుకోకు వలపు వాలు కన్నులా
దరహసించు దశమినాటి వెన్నెలా
నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో
అడగాలి ముద్దులన్ని నన్నిలా...