Taraka Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Taraka Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

Taraka Ramudu : Kopam Vaste Song Lyircs (కోపం వస్తే మండుటెండ )

చిత్రం: తారక రాముడు (1997)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి




పల్లవి:

ఆమె: కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ వానమబ్బు లాంటి వాటం నీదయా

అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట నిన్ను నమ్మినాను అంతా దయా

ఆమె: నీ అల్లర్లు అందం, నీ అలకల్లు అందం నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ వానమబ్బు లాంటి వాటం నీదయా చరణం-1: అతడు: చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట ఆమె: మురికిని కడిగినా మనసుని కడిగినా రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లే వేరటా అతడు: అవునో కాదో తెలియదు కానీ నువ్వు చెబుతుంటే అవునంటా ఆమె: మరి అంతలోనె బుంగమూతి సంగతేంటటా అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట నిన్ను నమ్మినాను అంతా నీదయా చరణం-2: ఆమె: నిండుకుండ కాదు కనుక తొణుకుతుందదీ అంత వింత అందులోన ఏమిటున్నదీ అతడు: నాలో తెలివికీ దీన్లో నీటికీ పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నదీ ఆమె: అమృతం లాంటీ హృదయం నీది అంత కన్న వేరే వరమేది అతడు: అది తెలిసి కూడ కసురుకుంటే నేరమెవరిదీ ఆమె: కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ వానమబ్బు లాంటి వాటం నీదయా అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట నిన్ను నమ్మినాను అంతా నీదయా ఆమె: నీ అల్లర్లు అందం, నీ అలకల్లు అందం నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం