Teenmaar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Teenmaar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, నవంబర్ 2021, శనివారం

Teenmaar : Sri Ganga Song Lyrics (జై బోలో శంకర మహారాజ్‌)

చిత్రం: తీన్మార్ (2011)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: వేదాల హేమచంద్ర, శ్రీవర్ధిని

సంగీతం: మణి శర్మ


జై బోలో శంకర మహారాజ్‌కీ బోలో కాశీవిశ్వనాథ్‌కి   హర హర హర హర మహదేవ్  జై బోలో శంకర మహారాజ్‌కీ బోలో కాశీవిశ్వనాథ్‌కి   హర హర హర హర మహదేవ్  గంగా నీలాంటి మనసీయవే   జన్మంతా నీ బాట నడిపించవే   శివపూజను... శివపూజను కరుణించవే   ప్రియసేవలో తరియించు వరమియ్యవే   కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహదేవా   పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ   మదిలో కోరిక తీరే మార్గం కావా   జై బోలో శంకర మహారాజ్‌కి హర హర మహాదేవ్   జగమేలు శివశంకరా...   జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా   ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా   నీ కంటిచూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా      నిప్పు నీరు రెంటినీ...   నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా   విడ్డూరం చూపావుగా నీ లీలతో   నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా   అమావాస్య లేదుగా కలలో ఇలలో   నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ   ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి   నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ                            ॥బోలో॥॥   సనిపని సరి సనిపని సరి మపనిసా (2)   రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి (2)   సరిసని దనిపమ గమనిప మగరినిసా (2)      ఆరాధించే తొందర...   ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా మారేడై మనసుందిరా నీ ముందర   నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా   వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట   ఆత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట   ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ                                       ॥బోలో॥॥

Teenmaar : Vayyarala Jabilli Song Lyrics (వయ్యారాల జాబిల్లి.. )

చిత్రం: తీన్మార్ (2011)

రచన: రహమాన్

గానం: కారుణ్య

సంగీతం: మణి శర్మ



వయ్యారాల జాబిల్లి.. ఓణి కట్టీ గుండెల్లోన చేరావె.. గంటే కొట్టీ ఆ నందూరి వారింకి.. మళ్ళీ పుట్టీ కవ్వింతల్లొ ముంచావె.. కళ్ళే మీటీ నది వలె కదిలా.. నిలబడకా కలలను వదిలా.. నిను వెతకా వయసే.. వరస మార్చినదే మనసే.. మదువు చిలికినదే అడుగే.. జతను అడిగినదే అలలై.. తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి.. ఓణి కట్టీ గుండెల్లోన చేరావె.. గంటే కొట్టీ ఆ నందూరి వారింకి.. మళ్ళీ పుట్టీ కవ్వింతల్లొ ముంచావె.. కళ్ళే మీటీ నీ పరిచయమే.. ఓ పరవశమై జగాలు మెరిసెనులే.. నా యద గుడిలో.. నీ అలికిడిని పదాలు పలకవులే.. అణువణువూ.. చెలిమి కొరకూ అడుగడుగూ.. చెలికి గొడుగూ ఇది వరకూ.. గుండె లయకూ తెలియదులే.. ఇంత పరుగూ వయసే.. వరస మార్చినదే మనసే.. మదువు చిలికినదే వయ్యారాల జాబిల్లి.. ఓణి కట్టీ గుండెల్లోన చేరావె.. గంటే కొట్టీ ఆ నందూరి వారింకి.. మళ్ళీ పుట్టీ కవ్వింతల్లొ ముంచావె.. కళ్ళే మీటీ నీ ప్రతి తలపు.. నాకొక గెలుపై చుగాలు తొణికెనులే.. నీ శ్రుతి తెలిపె.. కొయిల పిలుపే తథాస్తు పలికెనులే.. గగనములా.. మెరిసి మెరిసీ పవనములా.. మురిసి మురిసీ నినుకలిసే.. క్షణము తలచీ అలుపు.. అనే పదము మరచి వయసే.. వరస మర్చినదే మనసే.. మదువు చిలికినదే

Teenmaar : Gelupu Thalupu Song Lyrics (గెలుపు తలుపులే.)

చిత్రం: తీన్మార్ (2011)

రచన: రహమాన్

గానం: జావేద్ అలీ ,శ్రీరామ చంద్ర

సంగీతం: మణి శర్మ


గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే అడుగు మెరుపులా.. మారే.. ఆనందమే వీడదీ.. బంధమే ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా మెరిసావే.. రంగుల్లోనా  కల తీరే.. సమయానా అల నేనై.. లేస్తున్నా అనుకుందే.. చేసేస్తున్నా దారులన్ని.. నాతో పాటుగా ఊయలూగి పాటే.. పాడగా నను వీడి కదలదు.. కాలమొక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుకల్లొ చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు నా కోసమే అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవ్వాల గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుంది నీ కలా ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటె నువ్విలా నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే