చిత్రం:తల్లిదండ్రులు(1990)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
కురుకుర్రు కుర్రో తందాన తాన
కురుకుర్రు కుర్రో తందాన తాన
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
హొయ్ చామంతి పువ్వంటి ఛాయున్న బాలా
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
ఆహూ.......... ఆహూ..........
అరె సంపెంగ చెంపల్లో కింపెక్కెనేల
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
ఆహూ.......... ఆహూ..........
ఓ..ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
ఏమంత కోపాలో అయ్యో ఏమాపసోపాలో
తాడెత్తు లేస్తున్న తైతక్క తగ్గించు తాయెత్తు కట్టాలో
ఆహూ.......... ఆహూ..........
అరె చామంతి పువ్వంటి ఛాయున్న బాలా
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
డింగిరి డింగిరి తాన....డింగిరి డింగిరి తాన
డింగిరి తాన
డింగిరి డింగిరి తాన....డింగిరి డింగిరి తాన
డింగిరి తాన
హే హే హే.... హే హే హే....
చరణం:1
ఆహా.... ఆ.... ఆ....
కమ్మగా కూసే కోయిల సై
కత్తులు దూసిందేమిలా సై
కారాలు మేసిన కాకిలా సై
కేకలు వేసిందేమిలా సై
పల్నాటి నాగమ్మలా కోడి పందాలకొచ్చిందిరా
పల్నాటి నాగమ్మలా కోడి పందాలకొచ్చిందిరా
పొట్టేలు పున్నమ్మో పోట్లాట మానమ్మో
కొమ్ముల్లో వాడెక్కి కొండల్తో ఢీడిక్కి
కోరావా ఇల్లా కోనంగి పిల్ల
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
హొయ్ చామంతి పువ్వంటి ఛాయున్న బాలా
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
అరె సంపెంగ చెంపల్లో కింపెక్కెనేల
రావణ ఉయ్యాలో హా.. దేవన ఉయ్యాలో
జై చక్క జై చక్క జై జై
జై చక్క జై చక్క జై జై
రు.... రు.... రు....
చరణం:2
ఆహా.... ఆ.... ఆ....
ఒప్పుల కుప్పకు ఎందుకో సై
నిప్పులు కక్కే కోరిక సై
చక్కెర బొమ్మకు ఎందుకో సై
చిందులు దూకే వేడుక సై
జోరెంతో చూడండిరో
చూసి జోహారు చేయండిరో
జోరెంతో చూడండిరో
చూసి జోహారు చేయండిరో
గయ్యాళి గంగమ్మో కయ్యాలు చాలమ్మో
సిసింద్రీ రవ్వల్లే చిర్రెక్కి పోయావా
చిరాకు వల్ల శివంగి పిల్ల
రావణ ఉయ్యాలో హొయ్ హొయ్ హొయ్
దేవన ఉయ్యాలో
అరె అరె చామంతి పువ్వంటి ఛాయున్న బాలా
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
ఒయ్ సంపెంగ చెంపల్లో కింపెక్కెనేల
రావణ ఉయ్యాలో దేవన ఉయ్యాలో
ఓ..ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
ఏమంత కోపాలో అయ్యో ఏమాపసోపాలో
తాడెత్తు లేస్తున్న తైతక్క తగ్గించు తాయెత్తు కట్టాలో
రావణ ఉయ్యాలో హా హా హా
దేవన ఉయ్యాలో