Thodi Kodallu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Thodi Kodallu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2022, బుధవారం

Thodi Kodallu : Nee Shoku Choodakunda Song Lyrics (నీ సోకు చూడకుండ)

చిత్రం: తోడి కోడలు (1957)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, ,పి. సుశీల

సంగీతం: మాస్టర్ వేణు




అతడు : నీ సోకు చూడకుండ నవనీతమ్మ నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ ఆమె : ఎంత మాయగాడవురా రమణయ్ మావ నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ అతడు : నీవు చూసే చూపులకు వన్నెలాడీ నీరుగారి పోతానె చిన్నెలాడి మనసు దాచుకోలేను నవనీతమ్మ పది మాటలైన చెప్పలేను ముద్దులగుమ్మా నీ సోకు .... ఆమె : ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ మోసపుచ్చి పోతావు చిన్నవాడ మాటవరసకైన నువ్వు రమణయ్ మావా ఒక్క మాటైనా ఇచ్చావా రమణయ్ మావ ఎంత ..... అతడు : నీ తోటి సరసమాడి పడుచు పిల్లా నెల్లూరు వెళతానే గడుసు పిల్లా మళ్ళి తిరిగి వస్తానే నవనీతమ్మా నిను మరచిపోయి ఉండలేనె ముద్దులగుమ్మా నీ సోకు.... ఆమె : నెల్లూరు పోతేను నీటుగాడా తెల్ల బియ్యం తెస్తావా నీటు గాడా పక్క ఊళ్ళో నువ్వుంటె రమణయ్ మావ నే ప్రాణాలు నిల్పలేను రమణయ్ మావ ఎంత.......

18, జనవరి 2022, మంగళవారం

Thodi Kodallu‬ : Aaduthu Paaduthu Song Lyrics (ఆడుతు పాడుతు )

చిత్రం: తోడి కోడలు (1957)

సాహిత్యం: కొసరాజు

గానం: ఘంటసాల, ,పి. సుశీల

సంగీతం: మాస్టర్ వేణు



ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అప్పుమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అప్పుమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది అంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే అంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే నీ గాజులు ఘల్లని మోగుతుంటే నా మనసు ఝల్లుమంటున్నది నా ఝల్లుమంటున్నది మనసు ... ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అప్పుమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది తీరని కోరికలూరింపంగా ఓర కంట నను చూస్తూ ఉంటే తీరని కోరికలూరింపంగా ఓర కంట నను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులు చిందులు తొక్కి… చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది నును ముంచుకొస్తున్నది సిగ్గు ... . ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అప్పుమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది చెదరి జారిన కుంకుమరేఖలు పెదవుల పైన మెరుస్తువుంటే చెదరి జారిన కుంకుమరేఖలు పెదవుల పైన మెరుస్తువుంటే తీయని తలపులు నాలో ఏమో ... తీయో తప్లు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి అహ ... తికమకజేస్తూవున్నవి ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అప్పుమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది పరవశమైపోతున్నది… ఆ ఆ .ఆ .ఆ .ఆ .ఆ .ఆ . ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అప్పుమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది