Vajrayudham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vajrayudham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2024, ఆదివారం

Vajrayudham : Sannajaji Pakka Meeda Song Lyrics (సన్నజాజి పక్క మీద సంకురాత్రి)

చిత్రం: వజ్రాయుధం (1985)

రచన: వేటూరి సుందరరామ మూర్తి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ,యస్. జానకి సంగీతం:కె. చక్రవర్తి



సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి హా... పాలు పట్టుకొచ్చాను... పంచదార వేసుకో... పండు పట్టుకొచ్చాను... పక్కకొచ్చి పంచుకో... పాలుపంచుకుంటాను పడుచందాము పండిచ్చుకుంటాను పట్టి మంచము సర్దుచెయ్యకు నిశిరాత్రి ముద్దు తీర్చుకో నడిరాత్రి సర్దుచెయ్యకు నిశిరాత్రి ముద్దు తీర్చుకో నడిరాత్రి హద్దు చేరుపుకో తొలిరాత్రి తొలిరాత్రి ఏయ్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి హా... తెల్లచీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో మల్లె పూలు తెచ్చాను మంచమంతా జల్లుకో చిన్ని పంట తేనేలన్ని నువ్వు పిండుకో కోడికూత పెట్టించి నువ్వు పండుకో రతికే తెలియని రస రాత్రి శృతిలే కలిసిన సుఖ రాత్రి రతికే తెలియని రస రాత్రి శృతిలే కలిసిన సుఖ రాత్రి ఎరగని వాళ్లకి యమ రాత్రి యమ రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి హా...

Vajrayudham : Aa Buggameeda Song Lyrics (ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా..)

చిత్రం: వజ్రాయుధం (1985) రచన: గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ,యస్. జానకి సంగీతం:కె. చక్రవర్తి



ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా.. ఆ చల్లకొచ్చి ముంత దాచుడేందబ్బా చూడగానె తాపమాయే ఎండలోన దీపమాయే రెప్పగొట్తి గిల్లమాక రెచ్చగొట్టి వెళ్లమాక రేపు దాక ఆగలేనులే నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా గుమ్మ ఈడు తాపమాయే గుండెలోన తాళమాయే దగ్గిరుంటె దప్పికాయె పక్కనుంటే ఆకలాయె ఎక్కడింక దాగిపోనురా.. ఎంత సిగ్గు పుట్టుకొచ్చె చెంప తాకితే చెంప మొగ్గలేసుకొచ్చె చెయ్యి తాకితే ఏడముట్టుకుంటె ఏమి పుట్టుకొస్తదో పుట్టుకొచ్చి ఏమి పుట్టి ముంచి పోతదో అబ్బా ఆగబ్బ అబ్బా ఉండబ్బా చిన్న ముద్దబ్బ ఇపుడొద్దబ్బా ఆపుతున్న కొద్ది అగ్గిమంటబ్బా అంటుకున్నదంటె పెద్ద తంటబ్బా చెంగుపట్టి లాగగానే చీరకట్టు జారిపోయె ఉన్న గుట్టు ఊరుదాటెరా... ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా.. ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా ఈడు వేడి ఎక్కిపోయె ఏడతాకినా నీరు కాస్త ఆవిరాయె నీడ తాకినా నిన్నుముట్టుకుంటె గుండె గంటకొట్టెనే ఒంటిగున్న లోకమంత జంటకట్టెనే అబ్బా తప్పబ్బా.. తప్పే ఒప్పబ్బా.. ఒప్పుకోనబ్బా ఒక్కసారబ్బా ఎప్పుడంటె అప్పుడైతే ఎట్టబ్బా గుట్టుమట్టు చూసుకోవు ఏందబ్బ చుక్కపూల పక్కమీద జున్నుపాల కొంగులైతే మల్లెపూలు మాటతప్పునా నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా.. గుమ్మ ఈడు తాపమాయే గుండెలోన తాళమాయే రెప్పగొట్టి గిల్లమాక రెచ్చగొట్టి వెళ్లమాక రేపు దాక ఆగలేనులే నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా ఆ చల్లకొచ్చి ముంత దాచుడేందబ్బా