చిత్రం:వంశీ(2000 )
సంగీతం : మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో
కన్నె బొమ్మ ఆడుతున్నది...
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో
కోరికమ్మ రేగుతున్నది...
వేడి పెంచక ఏడిపించక
ఈడు పంచి ఊరడించరాదా...
గోరువెచ్చగ గోలరెచ్చెగ
జోడుకట్టి జోలకొట్టరాదా...
అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధా...
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో
కన్నె బొమ్మ ఆడుతున్నది...
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో
కోరికమ్మ రేగుతున్నదీ...
సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే....ఓఓ.. కన్ను దాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదీ ....ఏఏ.. వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుందీ...ఓఓ.. బెదిరితే కథ కదలదే అని తహతహ తరుముతు ఉన్నదీ ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది... పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నదీ...
లెక్క చేయమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గనొక్కినా...ఓఓ పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా..ఆఆఆ... అడగనా ఒక బహుమతి నువు ఛీ పాడు అనకుంటే..ఓఓ అడగద్దు ఎవరనుమతి చెలి తడితడి పెదవులు అందితే కయ్యానికే తయారయ్యి సై ఆట సయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నదీ... వేడి పెంచక ఏడిపించక ఈడు పంచి ఊరడించరాదా.. గోరువెచ్చగ గోలరెచ్చెగ జోడుకట్టి జోలకొట్టరాదా.. అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధా...