చిత్రం : వరం (2004)
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
రచన : వరికుప్పల యాదగిరి
గానం: ఉదిత్ నారాయణ్
పల్లవి:
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో… సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో…
చరణం-1:
నవ్వే వసంతమై.. నాలో ప్రశాంతమై.. ఉంటావా నువ్వాదేవుని వరమై… పిలిచే సంగీతమై.. పలికే నాగీతమై.. కొలువుంటావా నువు నాలో సగమై… నిన్నే చూడని ఆ రోజంతా దిగులే.. కదిలే కాలం నా కన్నీరై కరిగే… ప్రేమా.. ప్రేమా అని పిలిచిందే నిన్నే మరి… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…
చరణం-2:
గుడిలో దేవున్ని మొక్కి కొబ్బరి కాయను కొట్టి… నిన్నే క్షేమంగా చూడమంటున్నా… కలలో నిన్నే చూసి.. గుండెని పువ్వుగ కోసి.. నీకే ఇవ్వాలని పరిగెడుతున్నా.. నీ అడుగులు మోసే మట్టిని ముద్దాడితే… యదలో నీ ఊహలు పున్నమిలా విరిసే… నీప్రేమ వన్నెలలో నానీడ నిన్నే చూపే.. కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా… నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…