Yedanthasthula Meda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yedanthasthula Meda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2025, శనివారం

Yedanthasthula Meda : Idi Megha Sandheshamo Song Lyrics (ఇది మేఘ సందేశమో.. )

చిత్రం : ఏడంతస్తుల మేడ (1980)

సంగీతం : చక్రవర్తి

రచన : రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి :
అహ.. హా..హా..
అహహహ.. ఆ ఆ ఆ హా ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో
ఆ.. ఆ.. ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో చిరుజల్లు కురిసింది వినువీథిలో
చిరుజల్లు కురిసింది వినువీథిలో హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో..
ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో చరణం 1 :
అహ.. హా..హా..
అహహహ.. ఆ ఆ ఆ హా వెల్లువలా పొంగే నా పాల వయసు
పల్లవి పాడేను నా మూగ మనసు
వెల్లువలా పొంగే నా పాల వయసు.. ఆ.. ఆ.. ఆ..
పల్లవి పాడేను నా మూగ మనసు నీ పాట నా బాట కావాలని
ఆ నింగి ఈ నేల కలవాలని చినుకులు వేశాయి ఒక వంతెన
చినుకులు వేశాయి ఒక వంతెన
కలిసిన హృదయాలకది దీవెనా ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో చరణం 2 :
తడిసిన తనువేదో కోరింది స్నేహం..
కలిగెను జడి వాన నాకు దాహం
తడిసిన తనువేదో కోరింది స్నేహం..
ఆ.. హా..కలిగెను జడి వాన నాకు దాహం నీ చెంత నే మేను మరవాలనీ
నీ కంటిలో పాప కావాలనీ వలపులు చేశాయి వాగ్దానము..హా.. ఆ.. ఆ
వలపులు చేశాయి వాగ్దానము
మనకివి సిరులింక కలకాలము ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో.. ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో

13, ఏప్రిల్ 2022, బుధవారం

Yedanthasthula Meda : Yedanthasthula Meda Idhi Song Lyrics (ఏడంతస్థుల మేడ ఇది)

చిత్రం : ఏడంతస్తుల మేడ (1980)

సంగీతం : చక్రవర్తి

రచన : వేటూరి

గానం: పి. సుశీల



పల్లవి: ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది ఏమీ లేక ఉన్నదొక్కటే... నాకు మీరు.. మీకు నేను నాకు మీరు.. మీకు నేనూ.... చరణం 1: పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే చాప కన్న చదరే మేలని.. చతికిలపడి అతుకుతు ఉంటే ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే.. ఏయ్ నిదరనే నిదరపొమ్మంటుంటే ఏ ఏ ఏ... వెన్నెల మల్లెల మంచమిది.. ఎన్నో జన్మల లంచమిది మూడు పొద్దులు ముద్దు ముచ్చటే.. నాకు మీరు .. మీకు నేను నాకు మీరు మీకు నేనూ..... ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది చరణం 2: పాయసాన గరిటై తిరిగే... పాడు బతుకులెందుకు మనకు పాలలోన నీరై కరిగే.. బంధమొకటి చాలును కడకు పాయసాన గరిటై తిరిగే... పాడు బతుకులెందుకు మనకు పాలలోన నీరై కరిగే... బంధమొకటి చాలును కడకు చావు కన్నా బ్రతుకే మేలని.. తెలిసి కలిసి మసులుతు ఉంటే ప్రేమకన్న పెన్నిధి లేదని తెలుసుకో.. ఏయ్ తెలుసుకో మనసు నీదంటుంటే ఏ ఏ ఏ... ఎండ వానల ఇల్లు ఇది..ఎండని పూపొదరిల్లు ఇది రేయి పగలు ఆలు మగలే... నాకు మీరు.. మీకు నేను నాకు మీరు మీకు నేనూ... ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది ఏమీ లేక ఉన్నదొక్కటే... నాకు మీరు.. మీకు నేను నాకు మీరు.. మీకు నేనూ....