చిత్రం : ఏది పాపం ఏది పుణ్యం (1979)
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
రచయిత : మైలవరపు గోపి
సంగీతం : చెళ్లపిళ్ల సత్యం
పల్లవి :
కాలమిలా ఆగిపోనీ.. కల నిజమై సాగిపోనీ.. అన్నీ మరచి.. ఈ నిమిషంలో.. నీ ఒడిలోనే నిదురపోనీ.. కాలమిలా ఆగిపోనీ.. కల నిజమై సాగిపోనీ.. అన్నీ మరచి.. ఈ నిమిషంలో.. నీ ఒడిలోనే నిదురపోనీ.. కాలమిలా ఆగిపోనీ..
చరణం 1 :
తొలిసంజె మలిసంజె వేళ..
నా చెంత చెలి ఉన్న వేళ..
చిరుగాలి సెలయేరు లేల..
నా మనిషి తోడున్న వేళ..
అరుదైన వేళ..ఈ శుభవేళ..
బ్రతుకే వెన్నెల వేళా..వేళా..వేళా..
కాలమిలా ఆగిపోనీ..
కల నిజమై సాగిపోనీ..
అన్నీ మరచి..
ఆ..ఆ... ఆ
ఈ నిమిషంలో..
ఆ..ఆ... ఆ
నీ ఒడిలోనే నిదురపోనీ..
కాలమిలా ఆగిపోనీ..
చరణం 2 :
సిరిదివ్వెలో వెలుగులాగా.. నీ చూపులో నిలిచిపోనీ.. సిరిదివ్వెలో వెలుగులాగా.. నీ చూపులో నిలిచిపోనీ.. జేగంటలో రవళిలాగా.. నీ ఊపిరై కలిసిపోనీ.. కలలే గానీ..కలతే లేనీ లోకాలకే చేరిపోనీ..చేరిపోనీ.. కాలమిలా ఆగిపోనీ.. కల నిజమై సాగిపోనీ.. అన్నీ మరచి.. ఆ..ఆ.. ఆ ఈ నిమిషంలో.. ఆ..ఆ... ఆ నీ ఒడిలోనే నిదురపోనీ.. కాలమిలా ఆగిపోనీ..